Home తాజా వార్తలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద ఉధృతి

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద ఉధృతి

Flood Water Reduced To Nagarjuna Sagar Projectనల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి తగ్గింది. దీంతో అధికారులు  గేట్లను మూసివేశారు. ప్రాజెక్ట్ కు 68,756 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 52,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ  ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం  589.90 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.