Friday, March 29, 2024

కాంబోడియాలో వరదలకు 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Flooding in Cambodia leaves at 11 dead

ఫ్నోమ్ పెనా (కాంబోడియా): కాంబోడియాలో ఈనెల మొదటి నుంచి సంభవించిన వరదలకు దాదాపు 11మంది మృతి చెందారని ప్రకృతి వైపరీత్యాల విభాగం అధికారి వెల్లడించారు. వర్షాకాల వర్షాలకు తుపాన్ తోడు కావడంతో గత వారం అనేక ప్రావిన్సుల్లో వరదలకు దారి తీసిందని జాతీయ ప్రకృతి వైపరీత్యాల కమిటీకి చెందిన అధికార ప్రతినిధి ఖున్ శోఖ తెలియచేశారు. మొత్తం మృతులు 11 మందిలో 10 మంది వరదల్లో మునిగి చనిపోయారని, మరొకరు పిడుగుపాటుకు బలయ్యారని వివరించారు. అనేక వందల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని చెప్పారు. బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా శుక్రవారం ప్రధాని హున్‌సేన్ స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Flooding in Cambodia leaves at 11 dead

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News