Home తాజా వార్తలు గోదారి ఉరకలు

గోదారి ఉరకలు

Godavari River

4.47 టిఎంసిలకు చేరిన నిల్వ
మేడిగడ్డ 85 గేట్ల మూసివేత
దేవాదులలో మూడు మోటార్ల వెట్న్

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతీ రోజు కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వచ్చిన నీటిని కన్నెపల్లి పంప్‌హౌజ్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిల్వ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి ఏర్పాటుచేసిన 85 గేట్లను మూసివేయడంతో వచ్చిన ప్రతీ నీటి చుక్క మేడిగడ్డ వద్ద స్టోర్ అయింది. ప్రస్తుతం 96.5 మీటర్లకు నీరు చేరింది. కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద స్టోర్ చేసిన నీటిని సోమవారం కూడా 5 మోటార్లతో గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. కన్నెపల్లి నుంచి వస్తున్న ప్రవాహం అన్నారం బ్యారేజ్‌కి 11 వేల క్యూసెక్కులతో ప్రతీ రోజు చేరుకోవడం వల్ల సోమవారం మధ్యాహ్నం వరకు 4.47 టీఎంసీలకు చేరుకుంది. అన్నారం బ్యారేజ్ ఎఫ్‌ఆర్‌ఎల్ సామర్థం 119.000 మీటర్లు కాగా ప్రస్తుతం 115.500 మీటర్లకు చేరుకుంది. అన్నారం బ్యారేజ్‌కి 11 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ఉంది. కన్నెపల్లి నుంచి 5 మోటార్ల ద్వారా జల ధార అన్నారం బ్యారేజ్‌తోపాటు సుందిళ్ల ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్‌గా వెళ్తుంది. ఆ నీరు ప్రస్తుతం 32 కిలోమీటర్లకు చేరుకుంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది తోడు కావడం వల్ల గోదావరి వరద భారీగా కన్నెపల్లి, మేడిగడ్డ ప్రాజెక్టులకు చేరుకుంటుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నీటి సామర్థం 100 మీటర్లు కాగా 96.5 మీటర్లకు చేరుకుంది. మేడిగడ్డ పూర్తి సామర్థం 16.17 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ 6.508 టీఎంసీలకు చేరింది. బ్యారేజ్‌కి 2100 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ఉంది. గోదావరికి కొనసాగుతున్న వరద ప్రవాహంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు ప్రాజెక్టులకు నీటి నిల్వలు చేరుతున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజ్‌లకు నీటి నిల్వలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద నిర్మించిన దేవాదుల ప్రాజెక్టుకు కూడా భారీగా గోదావరి ప్రవాహం చేరుకుంటుంది. ప్రస్తుతం దేవాదుల పంప్‌హౌజ్‌లో మూడు మోటార్లు వెట్న్ అవుతున్నాయి. దేవాదుల ద్వారా ఎత్తిపోస్తున్న నీరు జనగామ జిల్లాకు తరలిస్తున్నారు. ఆ నీరు ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్, తపాస్‌పల్లి రిజర్వాయర్లకు చేరుకుంటున్నాయి. వచ్చిన ప్రతీ నీటి బొట్టును ఒడిసిపడుతున్న ఇంజనీరింగ్ అధికారులు గోదావరి నది పొడవున నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటిని తోడేసి నిల్వ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతీ రోజు రెండు టీఎంసీల నీటిని ఐదు నెలల పాటు ఎత్తిపోయాలనే లక్షంతో ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద ఐదు మోటార్లతో నీటిని ఎత్తిపోయడం వల్ల రోజుకు ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ నీరు అన్నారం బ్యారేజ్‌లో నిల్వ అవుతుంది. ప్రస్తుతం 4.47 టీఎంసీలకు చేరుకోగా 10.87 టీఎంసీల నీటి సామర్థం ఉంది. ఇంకా 5.40 టీఎంసీల నీరు చేరితే అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు గోదావరి వరద భారీగా ప్రతీరోజు వరద నీరు చేరుతున్నందున రెండు రోజుల్లో 6వ మోటారును కూడా వెట్ రన్ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. జులై నెలాఖరు వరకు కన్నెపల్లిలోని 11 మోటార్లను వెట్న్ చేయడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లను చేస్తున్నారు. అన్ని మోటార్లు వెట్న్ కావడానికి కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద నీటి నిల్వలు భారీగా చేరాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఇప్పటికే మేడిగడ్డ, కన్నెపల్లి బ్యారేజ్‌లకు సగం నీటి సామర్థం చేరుకుంది.
గోదావరి నీళ్లకు రైతుల పూజలు
మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామ తీ రంలోని గొదావరిలో సోమవారం ప్పట్ల ఎంపిటిసి బడికెల దేవమ్మ ఆద్వర్యంలో రైతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. రివర్స్ పంపింగ్ ద్వారా అన్నారం పంపౌస్ మంథని మండలంలోని గోదావరిలోకి నీ రు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే రైతులు ఉప్పట్ల గ్రామంలో గోదావరిలో చేరిన నీళ్లలో పసుపు కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చేశారు.

flooding waters to godavari river