Home తాజా వార్తలు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరదనీటి ప్రవాహం

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరదనీటి ప్రవాహం

Floodwater inflow to Sriramsagar projectనిజామాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ఇన్‌ఫ్లో 3.50లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4.04 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,089 అడుగులుగా ఉందని వారు పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 81.17 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.