Home తాజా వార్తలు పిండివంటలు భలే రుచిగా ఉన్నాయి : మాజీ ఎంపి కవిత

పిండివంటలు భలే రుచిగా ఉన్నాయి : మాజీ ఎంపి కవిత

Ex MP Kavitha

 

హైదరాబాద్ : పిండివంటలు భలే రుచిగా ఉన్నాయని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. వడ్డీలేని రుణాల కింద రూ. 619 కోట్లు మంజూరు చేసినందుకు, రుణాలు రావడానికి మూలకారణమైన మాజీ ఎంపీ కవితను నిజామాబాద్ జిల్లా, కమ్మరపల్లి మండల సమాఖ్య పరిధిలోని నర్సాపూర్ గ్రామ సమాఖ్య సభ్యులు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సెర్ప్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లోని కవిత ఇంటికి వచ్చి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అందులో భాగంగా పూలు, బొకేలకు బదులుగా గ్రామ సమాఖ్య సభ్యులు తయారుచేసిన పిండివంటలు కవితకు బహూకరించారు.

వాటిని రుచి చూసిన కవిత, పిండివంటలు భలే రుచిగా ఉన్నాయని గ్రామ సమాఖ్య సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళా సంఘాలు చేపట్టే ఆదాయ వృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు వడ్డీలేని రుణాల కింద ప్రభుత్వం రూ. 619 కోట్లు మంజూరు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మహిళల సంక్షేమం, సెర్ప్ సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరసయ్య, సుదర్శన్, సుభాష్‌గిరి, రాజారెడ్డి, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Flour dishes was very tasty says Ex MP Kavitha