Home తాజా వార్తలు తేనెటీగలా ఎగిరే రోబో

తేనెటీగలా ఎగిరే రోబో

Flying-robot

లండన్: తేనెటీగలు పట్టుకుందామంటే దొరకవు. తప్పింకునే ఎత్తుగడలు వీటికి చాలా ఎక్కువ. అలాంటి ఎత్తుగడలు అనుసరించే కీటకం వంటి రోబోను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది స్వేచ్ఛగా రెక్కలు విప్పి తేనెటీగలా ఎగురుతుంది. దీన్ని డెల్‌ఫ్లైనింబిల్ అని పిలుస్తున్నారు. కీటకాలు ఏ విధంగా పువ్వును ఆకర్షించి మళ్లీ వేగంగా అపాయం నుంచి తప్పించుకుంటాయో అదే విధంగా ఈ రోబో తేనెటీగ వ్యవహరిస్తుంది.

నిమిషానికి 17 సార్లు ఇది రెక్కలు కొట్టుకుంటుంది. గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. చలన దిశలో సర్దుబాట్లు చేసుకుని విమానాన్ని కూడా నియంత్రించే శక్తి కలిగి ఉంటుందని చెబుతున్నారు. గాలి దిశ ఉధృతంగా ఉన్నా 360 డిగ్రీల కోణంలో వంకర్లు తిరుగుతూ దూసుకు వెళ్తుందని రోబో డిజైనర్ మేటెజ్ కరసేక్ చెప్పారు. దీని రెక్కల నిడివి 33సెంమీ ఉంటుంది. గాలిలో ఐదు నిముషాలు స్థిరంగా నిలబడ గలదు. బాటరీ ఛార్జింగ్ పూర్తిగా ఉంటే కి.మీ కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

 

Flying robot like a bee