Home జాతీయ వార్తలు ఎగిరే పామును పట్టుకున్న అధికారులు: (వీడియో)

ఎగిరే పామును పట్టుకున్న అధికారులు: (వీడియో)

flying-snakeఒడిశా: ఓ వ్యక్తి దగ్గర నుంచి ఎగిరేపామును ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. సదురు వ్యక్తి పామును ప్రజలకు చూపించి జీవనోపాధి పొందుతున్నాడు. అయితే సమాచారం అందుకున్న జంతుసంరక్షణ శాఖ అధికారులు పామును పెంచుకుంటున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మూగజీవాలను హింసించడం, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నేరంగా పరిగణించబడుతుందని సిటీ ఫారెస్ట్ డివిజన్ ఇంచార్జ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.