Home తాజా వార్తలు వ్యాక్సీన్ టెక్నాలజీని పంచుకోవాలి

వ్యాక్సీన్ టెక్నాలజీని పంచుకోవాలి

FM calls for sharing of technologies on covid vaccine

 

ప్రపంచ దేశాలను కోరిన ఆర్థికమంత్రి నిర్మల

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా కొవిడ్ వ్యాక్సీన్‌పై సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశాలను కోరారు. వ్యాక్సీన్‌కు జాతీయవాదం ఉండదని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ట్రిప్స్ (మేధోసంపత్తి హక్కుల కోణానికి సంబంధించిన వాణిజ్యం) ఒప్పందం గురించి ఆమె మాట్లాడారు. వ్యాక్సిన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు దేశాలంతా ఏకమవ్వాలని, వ్యాక్సీన్ జాతీయవాదం ఉండదని, దీనిపై దేశాలు సానుకూల వైఖరిని చూపాలని ఆమె అన్నారు. ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) వార్షిక సమావేశంలో ఆమె ఈ విధంగా అన్నారు. ఈ ట్రిప్స్ డబ్లుటిఒ (ప్రపంచ వాణిజ్య సంస్థ) సభ్య దేశాలన్నింటి మధ్య చట్టబద్ధమైన ఒప్పందం. కొవిడ్ మహమ్మారితో పోరాటం చేసేందుకు అంతర్జాతీయ ప్రపంచ వ్యాప్తంగా సంస్థల అవసరం ఉందని అన్నారు.

ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించాల్సిందే
సిఐఐ అధ్యక్షుడు ఉదయ్ కోటక్
దేశంలో విపరీతంగా పెరుగుతున్న కొవిడ్ 19 కేసులను నివారించేందు కు ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలతో పాటు కఠిన చర్యలు తీసు కోవాలని ఇండస్ట్రీ బాడీ సిఐఐ ప్రభుత్వాన్ని కోరింది. ప్రజ ల ప్రాణాలను కాపాడేందు కు, వ్యాప్తిని నివారించేందుకు అత్యున్నత స్థాయి చర్యలు ఇప్పుడు తీసుకోవాల్సి ఉంద ని సిఐఐ అధ్యక్షుడు ఉదయ్ కోటక్ కోరారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర ప్రతిపాదికన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, పంపిణీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, కానీ దీనికి సమయం పడు తుందని అన్నారు. ఆసుపత్రి పడకలు, ఐసియు పడకలు, ఆక్సిజ న్, మందుల అవసరం ఎంతగానే ఉందని పేర్కొన్నారు. వైద్య సౌకర్యాల కోసం సైన్యం, కేంద్ర భద్రతా దళాలను మోహరించాలని కూడా ఆయన సూచించారు.

దిగుమతులపై ఐజిఎస్‌టి మినహాయింపు
పలు కొవిడ్19కు సంబంధించిన వస్తువుల దిగుమతుల పై కస్టమ్ సుంకం, హెల్త్ సెస్‌ను మినహాయిస్తున్నట్టు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వీటిపై తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది. 2021 అక్టోబర్ 31 వరకు రెమ్‌డెసివర్ ఇంజెక్షన్, ఎపిఐ, బీటా సైక్లోడెక్స్‌ట్రిన్ (ఎస్‌బిఇబిసిడి), ఇన్‌ఫ్లమేటరీ డయోగ్నస్టిక్ (తయారీదారులు) కిట్స్ వంటి వాటిపై ఐజిఎస్‌టి మినహాయింపును ప్రభుత్వం కల్పించింది. ఇంకా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ థెరపీకి సంబంధించిన పరికరాలు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్స్, క్రయోజెనిక్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంక్‌లు, కొవిడ్19 వ్యాక్సిన్‌లు వంటి వాటిపై జులై 31 వరకు హెల్త్ సెస్‌ను ప్రభుత్వం తొలగించింది.

FM calls for sharing of technologies on covid vaccine