Home తాజా వార్తలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలే జానపద నృత్యాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలే జానపద నృత్యాలు

Folk dances

 

డిఇఓ గోవిందరాజులు

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని బుధవారం జిల్లాస్థాయి విద్యార్థుల జానపద నృత్య పోటీలు స్థానిక నేషనల్ హై స్కూల్ నాగర్‌కర్నూల్‌లో నిర్వహించారు. జిల్లాలోని 25 పాఠశాలల నుండి ఈ పోటిలలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా డిఇఓ గోవిందరాజులు హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు.

స ందేశాత్మక కథల పుస్తకాలను విరివిగా చదవడం అవలంబించుకోవాలని వాటివల్ల సమాజ శ్రేయస్సుకు దోహపడే విధంగా నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్య పరచాలని అన్నారు. వాటిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం జానపద నృత్య పోటీలను ఏర్పాటు చేసిందని కలలు మన జీవితంలో ఒక భాగం కావాలని అంతరించిపోతున్న జానపద నృత్యాన్ని వెలుగులోకి తీసుకురవాల్సిన బాధ్యత ప్రభుత్వ పాఠశాలలపై ఉందన్నారు.

తెలంగాణ సంస్కృ తి కట్టుబొట్టు ప్రతిబింబించేలా విద్యార్థులు పోటీలకు హాజరు కావడం చాలా సంతోషదగ్గ విషమని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం గెలిచిన విద్యార్థులకు మొదటి బహుమతి పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలకు 1800 రూపాయలు, రెం డవ బహుమతి గుడిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు 1200 రూపాయలు, మూడవ బహుమతి కోడేరు కెజిబివి పాఠవాలకు 900 రూపాయల నగదు పారితోషికాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, ఓపెన్‌స్కూల్ కో ఆర్డినేటర్ నాగరాజు, న్యాయనిర్ణేతలు పోలోజు సత్యం, మురళిధర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Folk dances are reflection of Telangana culture