Home తాజా వార్తలు నిజామాబాద్‌లో ఫుడ్‌పార్క్ ప్రారంభం

నిజామాబాద్‌లో ఫుడ్‌పార్క్ ప్రారంభం

Food park

 

నందిపేట : రైతులందరికీ గిట్టుబాటు ధర వచ్చి రైతులు అభివృద్ధి బాటలో నడవాలనే ఉద్దేశంతో పుడ్‌పార్క్ నిర్మించడం జరిగిందని బిజెపి రైతుల శ్రేయస్సుకోరి ఇలాంటి పరిశ్రమలు స్థాపిస్తుందని ఫుడ్‌కార్పొరేషన్ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ అన్నారు. నిజామాబాద్‌లోని నందిపేట మండలంలోని లక్కంపల్లిలో 108 కోట్ల వ్యయంతో నిర్మించిన పుడ్‌పార్క్‌ను శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాటాడుతూ.. దేశంలో పేదరికం లేకుండా చేయడమే ప్రధానమంత్రి లక్ష్యమని అందులో భాగమే పుడ్‌పార్క్‌ను నిర్మించడం జరిగిందని ఆమె అన్నారు. దేశంలో పరిశ్రమలు స్థాపించడానికి 5 కోట్ల రూ.ల సబ్సిడీ రుణం ఇవ్వడం జరుగుతుందని సూచించారు. 14వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతులు నష్టపోతున్నారని ఎకరానికి 6వేల రూ. లు ఇవ్వడం జరుగుతుందన్నారు

 

Food park started at Nizamabad