Home తాజా వార్తలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు నాబార్డ్ ముందుకు రావాలి: కెటిఆర్

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు నాబార్డ్ ముందుకు రావాలి: కెటిఆర్

Food processing zones established by NABARD

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకు ఉన్న అవకాశాలను మంత్రి కెటిఆర్ వివరించారు. నాబార్డ్ సిజిఎంవైకె రావుతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సంరద్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న వ్యవసాయోత్పత్తుల విప్లవం వలన ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు నాబార్డ్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఐటి శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కెటిఆర్ వివరించారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌తో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు వీలుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌కు రుణసాయం అందించే అంశాన్ని పరిశీలించాలని నాబార్డ్ సిజిఎంవైకె రావును మంత్రి కెటిఆర్ కోరారు.