Home తాజా వార్తలు బరువు తగ్గడం సులభమే!

బరువు తగ్గడం సులభమే!

Food schedule

 

బరువు తగ్గాలనుకున్నప్పుడు వెంటవెంటనే జిమ్‌లకు వెళ్లి బోలెడన్ని వర్కవుట్లు చేసేసి, కడుపు మాడ్చుకుని త్వరగా సన్నగా అయిపోవాలనుకోవడం ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇవన్నీ చేయనవసరం లేకుండా మనం నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలను ఉపయోగించి క్రమంగా బరువును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. వీటితో పాటు వారానికి ఐదు రోజులు వాకింగ్, జాగింగ్‌లాంటి వ్యాయామాలు చేస్తే మంచిదంటున్నారు. లేకుంటే రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యాన పడే అవకాశం ఉంటుంది.

1. దాల్చిన చెక్క, తేనె బరువు తగ్గడానికి మంచి ఔషధంలా పని చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నిండా దాల్చిన చెక్క, తేనె కలిపిన నీళ్లను తాగాలి. ఒక కప్పు నీళ్లను మరిగించాలి. దాంట్లో ఒక టీ స్పూను దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ తేనె కలపాలి. దాన్ని పొరగడపునే తాగాలి. ప్రతి ఉదయం ఇలా చేస్తే కొన్ని నెలల్లోనే ఫలితం కనిపిస్తుంది.
2. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రెండు గంటలకొకసారి ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవాలి. అందుకోసం ఫుడ్ ప్లాన్ ఉండాలి. ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉండటం మంచిదికాదంటున్నాయి పరిశోధనలు. శరీరానికి కావాల్సిన శక్తి సక్రమంగా అందాలంటే తరచుగా ఆహారాన్ని తీసుకోవాలి. తినడానికి తినడానికి మధ్య ఎక్కువ సమయం ఉంటే శక్తిని కొవ్వుగా తీసుకుంటుంది శరీరం. ఇందువల్ల ఊబకాయం ఏర్పడుతుంది. అందువల్లే ప్రతి రెండు గంటలకు ఒకసారి తినాలి.

ఫుడ్ షెడ్యూల్: సమయానికి ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. రోజూ వేర్వేరు సమయాల్లో తినడం వల్ల శరీరం అయోమయానికి గురవుతుంది. ఆహార నియమాలను పాటించాలి. ప్రతి రోజూ ఒకే సమయానికి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేస్తుంటే అదే సమయాన్ని కంటిన్యూ చేయాలి.

గోల్డెన్ రూల్: రాజులాగా అల్పాహారం తీసుకోవాలి. రాణిలాగా భోజనం చేయాలి. పేదవాడిలాగా డిన్నర్ చేయాలన్నది పాత మాటే అయిగా కచ్చితంగా పాటించాల్సిందే. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్, ఇడ్లీ, దోసె, అన్నంతో చేసే ఐటమ్స్ పులిహోర, కట్టుపొంగల్‌లాంటివి తినేయొచ్చు. కానీ లంచ్‌లో మాత్రం అల్పాహారం కంటే కొంత తక్కువగా తినాలి. రాత్రి భోజనంలో అన్నం, చపాతీ, పెరుగు, కిచిడీ, కూరగాయలు..ఇలా ఉండేలా తక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ ప్రభావం చూపడానికి కొంత సమయం పడుతుంది. ఒక కప్పు నీరు ఉడకబెట్టి, టీ బ్యాగ్‌ను ముంచి 1-2 నిమిషాలు వదిలివేయండి. నీరు రుచిగా మారిన తర్వాత, టీ బ్యాగ్ తీసివేసి, నీటిని తాజా కప్పులో వడకట్టి తాగాలి. ఒక రోజులో 2, -3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీని తాగొద్దని సలహా ఇస్తునారు నిపుణులు. దీంట్లోనూ కెఫీన్ కంటెంట్ కొంత ఉంటుందట.
1. ఉదయాన్నే నిమ్మకాయ-నీటి మిశ్రమాన్ని ఒక గ్లాసు తాగాలి. ఒక గ్లాసు నీటిని గోరువెచ్చని ఉష్ణోగ్రతకు ఉడకబెట్టి, దాంట్లో అర నిమ్మకాయను పిండి కలిపి తాగాలి.
2. ప్రతిరోజూ కనీసం 2 లీటర్ల మంచి నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. భోజన సమయంలో లేదా తరువాత నీరు తాగటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ప్రతి భోజనానికి అరగంట ముందు, ఒక గ్లాసు నీరు,నిమ్మరసం, లాస్సీ లాంటివి ఏవైనా తాగొచ్చు. వీటితో పాటు సలాడ్ తీసుకోవచ్చు.

పుచ్చకాయ : పుచ్చకాయ, మిరియాలు సూపర్ కాంబినేషన్. బరువు తగ్గాలనుకునే వారికి దివౌషధం.
నల్ల మిరియాలు, కొంచెం ఉప్పుతో పుచ్చకాయను తినాలి. పుచ్చకాయ సుమారు 90% నీటిని కలిగి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జీరా వాటర్ : 1 టీస్పూన్ జీరాను తీసుకొని రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం మేల్కొన్నప్పుడు, ఈ గ్లాసు నీటిని జీరాతో ఉడకబెట్టి, ఖాళీ కడుపుతో తాగాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం సులభం.
1. చక్కెరకు బదులుగా బెల్లం వాడాలి. కాఫీ, టీల్లో తేనె, బెల్లం పొడిలాంటివి ఉపయోగించాలి. ఈ నియమాలను పాటిస్తూ రోజూ కొంత వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.

Food schedule for good health