మనతెలంగాణ/హైదరాబాద్ : ఇజ్రాయెల్‌కు చెందిన జెనోమిక్స్ ఎఐ కంపెనీ తన భారతదేశ ఆధారిత పంటల పెంపకం మెటీరియల్‌ను హైదరాబాద్‌కు చెందిన ఫోరాజెన్ సీడ్స్‌కు అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఎన్ఆర్జెన్ తన భారతదేశ ఆధారిత మొక్కజొన్న, బియ్యం, మిరపకాయ ఎనిమిదేళ్ల పంట పెంపకం కార్యక్రమాన్ని ఫోరాజెన్ సీడ్స్‌కు బదిలీ చేయనుంది. అగ్రి-టెక్ పరిశ్రమ కోసం సాఫ్ట్వేర్ జెనోమిక్స్ సొలూషన్స్ను అభివృద్ధి చేయడంపై ఎన్ఆర్జెన్ దృష్టి సారించింది. విత్తనాల అభివృద్ధి, ఉత్పత్తి వాణిజ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్ఆర్జెన్ తన భారతీయ భాగస్వామిగా ఫోరాజెన్ను ఎంపిక చేసింది.
2012 నుండి జెనోమిక్స్ భారత మార్కెట్ కోసం విస్తృత పెంపకం కార్యక్రమాలను నిర్వహించింది. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితులకు అనువైన వాణిజ్య ఉత్పత్తి విధానాన్ని అభివృద్ధి చేయడంలో జెర్మ్ప్లాజమ్లు, పెంపకం పదార్థాలు గణనీయంగా సహాయపడతాయని ఎన్ఆర్జెన్ సిఇఒ డాక్టర్ గిల్ రోనెన్ అన్నారు. ‘ఎన్ఆర్జెన్ జెనోమిక్స్ సాఫ్ట్వేర్ పరిష్కారాన్ని ఉపయోగించడం ద్వారా కొత్త రకాలను అభివృద్ధి చేయవచ్చని ఫోరాజెన్ సీడ్స్ ఎండి, సహ వ్యవస్థాపకుడు కె.అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.