Friday, April 19, 2024

హిందూ బాలికకు బలవంతంగా మత మార్పిడి, పెళ్లి

- Advertisement -
- Advertisement -

Hindu-girl

కరాచి : బలవంతంగా ఇస్లాం మతం పుచ్చుకుని, పెళ్లి చేసుకున్న 15 ఏళ్ల మైనర్ హిందూ బాలికను పాకిస్థాన్ కోర్టు మహిళా రక్షణ కేంద్రానికి పంపింది. ఈ బాలిక పాక్ సింధ్ ప్రావిన్సులో ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న హిందూ బాలిక మెహక్ కుమారిని అలి రజా సొలంగి అనే వ్యక్తి జనవరి 15న జకోబాబాద్ జిల్లా నుంచి ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దీనిపై బాలిక తండ్రి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కుమారి, సొలంగిలను కోర్టులో మంగళవారం ప్రవేశ పెట్టారు. అక్కడ నుంచి ఆమెను మహిళా రక్షణ కేంద్రానికి తరలించారు. ఆమె వయసును నిర్ధారిస్తూ నివేదిక ఫిబ్రవరి 2 నాటికి పంపాలని చండ్కా మెడికల్ కాలేజీ ఆస్పత్రిని కూడా కోర్టు ఆదేశించింది.

Forced conversion and marriage to Hindu girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News