Friday, March 31, 2023

అల్లంపల్లి అడవిలో అటవీ శాఖ మంత్రి

- Advertisement -

foresh

-పులులు, జంతు గణనను ప్రారంభించిన మంత్రి రామన్న

దట్టమైన అటవీ ప్రాంతంలో తెల్లవారు జామున
2 గంటల పాటు కాలినడకన పర్యటన

మనతెలంగాణ/ఆదిలాబాద్: దేశవ్యాప్త జంతు గణనలో భాగంగా పులులు, అటవీ జంతువుల గణన కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ, బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో కాలినడకన పర్యటించారు. అల్లంపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు రాళ్ళు రప్పలు చెట్లు చేమలు దాటు తూ సుమారు 6 కిలోమీటర్‌ల మేర కాలినడకన పయనించా రు. ఈసందర్భంగా పోలీసులు అడవిలో భద్రతను పర్య వేక్షించారు. మంత్రి వెంట సిఎఫ్‌వో సర్వానన్, డిఎఫ్‌వో ప్రభా కర్, ఉట్నూర్ ఎఫ్‌బివో విజయకుమార్, ఆర్‌డివో జగదేశ్వర్, డిఎస్‌పి వెంకటేష్, టైగర్ రిజర్వ్ బయోలజిస్ట్ జోగు ఎల్లంలతో పాటు పలువురు అటవీశాఖ అధికారులున్నారు. వీరితో కలిసి అల్లంపల్లి అటవీప్రాంతంలో కోలంగూడ,రాంపూర్ ఫారెస్ట్ బిట్లో మంత్రి పర్యటించారు. దారిపొడువునా పులుల, ఇతర అటవీజంతువుల అడుగుల గుర్తులను పరిశీలించారు. అదే విధంగా పలు చెట్లను పరిశీలిస్తూ జంతువులు చెట్లను గీరిన గుర్తు దృశ్యాలను గుర్తించారు. జంతువులకోసం అటవీ ప్రాం తంలో ఏర్పాటుచేసిన నీటి కుంటల సదుపాయాలను మంత్రి చూశారు. వన్య ప్రాణుల సంఖ్యను తెలుసుకొని వాటి రక్షణకు చర్యలు చేపట్టడంతో పాటు నివాస ఏర్పాట్లు చేయనున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న జంతువులను గుర్తించేందు కు ఏర్పాటు చేసిన కెమెరాలను మంత్రి పరిశీలించారు. పర్య టన మధ్యలో కొద్దిసేపు అడవిలోనేఆగి అందరితో కలిసి అల్పా హారం చేశారు. అడవిలోని తిరుగుతూ రకరకాల పండ్లు, పువ్వుల చెట్లను, బొంగుకర్రలను పరిశీలించారు. అడవిలో సంచ రిస్తున్న జంతువుల అడుగు గుర్తులతో పాటు మల విసర్జనాలను అధికారులు గుర్తిస్తూ ఫోటోలను చిత్రీకరించా రు. మధ్య మధ్యలో అధికారులతో మాట్లాడుతూ మంత్రి వివ రాలు తెలుసుకొన్నారు. అటవీ ప్రాంతం మ్యాప్‌ను చూస్తూ పరిసరాల వివరాలను గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి 4సంవత్సరలకు ఒక సారి దేశ వ్యాప్తంగా 6 రోజులపాటు జంతు గణన చేపట్టడం జరుగు తోందని తెలిపారు. తొలి మూడు రోజులు మాంసా హార జంతు వులైన పులులు, చిరుత పులులు, నక్క, ఎలుగు బంటి, ఐనాలాంటి జంతువుల అడుగు గుర్తుల ద్వారా లెక్కి స్తారని, మరో 3రోజులు శాఖాహార జంతువులైన సాంబ, మను బోతు, దుప్పి, కొండ గోరె, తదితర జంతువులను లెక్కి స్తామ న్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అల్లంపల్లి అటవీ ప్రాంతంలోని కొలం గూడ, రాంపూర్ ఫారెస్ట్ బిట్లో ఈ జనన ప్రారంభించడం జరిగిందని ఉమ్మడి జిల్లాలో మొత్తం 713 బిట్ లలో జనన చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కోటింలో  ముగ్గురు అధికా రులు ఉంటారన్నారు. ఇప్పటికి వారికి పూర్తిశిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News