Home ఆదిలాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య

ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య

Suicideఆదిలాబాద్ : ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ నెహ్రూ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే నెహ్రూ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవపరీక్ష నిమిత్తం నెహ్రూ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Forest Officer Commits Suicide In Adilabad