Home వనపర్తి ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ

ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ

రూ.లక్షలు దండుకుని వెట్టిచాకిరి చేయిస్తున్న ఎఫ్‌ఆర్‌ఒ

Collector

వనపర్తి ప్రతినిధి: నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్న వనపర్తి ఫారెస్ట్ రేంజ్‌అధికారి అబ్రహం నిరుద్యోగులకు అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి వారి నుండి రూపాయలు మూడున్నర లక్షలు  వసూళ్లు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి అటవీ శాఖలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ ,నాలుగు టెక్నికల్ అసిస్టెంట్స్, ఒక క్లర్క్, ఒక వాచర్‌మెన్, ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తమకు ఉద్యోగాలు ఇప్పి స్తానని 7 మంది నిరుద్యోగులతో ఎఫ్‌ఆర్‌ఓ అబ్రహం రూ. 3.50 లక్షలు వ సులు చేశాడు. వారందరు విడతల వారిగా చెక్కులు, అకౌంట్ ట్రాన్స్‌ఫర్, మరికొన్ని డబ్బులు చేతికి ముట్టజెప్పారు.

గత 5 నెలల నుండి అటవీ శాఖలో పనిచేస్తున్న తమకు వేతనాలు ఇవ్వకపోగా తమ ఉద్యోగాలు ఏమయ్యాయని పలుమార్లు ఎఫ్‌ఆర్‌ఓ అబ్రహంను డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు నిలదీశా రు. ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెల్లదీయడంతో పాటు మరి కొన్ని డబ్బులు ఇస్తే అటవీ శాఖలో ఉన్నతాధికారులకు ఇచ్చి తమరి ఉద్యోగాలు పర్మినెంట్ చేయడంతో పాటు 5 నెలల వేతనాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మరోసారి అబ్రహం మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేశారు. అబ్రహం మాటల పై నమ్మకం లేని నిరుద్యోగులు మళ్ల్లీ డబ్బులు చెల్లిస్తే మోసపోక తప్పదని రం గారెడ్డి జిల్లా తిరుమలోడి గూడకు చెందిన జంగయ్య ,పాన్‌గల్ మండలం గోప్లాపూర్ కు చెందిన మల్లేష్ , వనపర్తి హరిజనవాడకు చెందిన కమలమ్మ, పాన్‌గల్ మండలం శాకాపూర్‌కు చెందిన నరేష్‌కుమార్, కోడేరు మండల కేంద్రానికి చెందిన సురేష్, గోప్లాపూర్‌కు చెందిన చంద్రయ్య అనే బాదితులు తమకు న్యాయం చేయాలని బుధవారం వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారి వసం తకు వినతి పత్రం అందజేశారు. అందుకు స్పందించిన డిఎఫ్‌ఓ వివరాలు తెల్సుకునేందుకు పోన్ చేయగా స్పందించలేదు.

ఉద్యోగాలిప్పించి ఆదుకోండి..న్యాయం జరుగపోతే కలెక్టర్‌కు పిర్యాదు చేస్తాం.

అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తమకు మాయ మాటలు చెప్పి డబ్బు లు వసులు చేసిన ఎప్‌ఆర్‌ఓ అబ్రహంపై చర్యలు తీసుకుని తమ ఉద్యోగాలు తమకు ఇప్పించాలని నిరుద్యోగులు డిఎప్‌ఓ వసంతను వేడుకున్నారు. అప్పు లు తెచ్చి ఉద్యోగాలకోసం డబ్బులు చెల్లించామని 5నెలలుగా పనిచేస్తున్న త మకు వేతనాలు ఇప్పించాలని డిఎప్‌ఓతో బాదితులు మొర పెట్టుకున్నారు . త మకు న్యాయం చేయకపోతే కలెక్టర్‌ను ఆశ్రయిస్తామని బాదితులు తెలిపారు.