Home జాతీయ వార్తలు కుక్కను వెంటాడుతూ… ఇంట్లోకి చొరబడిన చిరుత

కుక్కను వెంటాడుతూ… ఇంట్లోకి చొరబడిన చిరుత

Dog

ముంబయి: ఓ కుక్కను వెంటాడుతూ ఇంట్లోకి చిరుత పులి చొరబడిన సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్‌పూర్ ప్రాంతం ఇటొలి గ్రామంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… కుక్క వెంటాడుతూ ఓ చిరుత పులి ఊరిలోకి వచ్చింది. కుక్క ఇంట్లోకి చొరబడడంతో పులి కూడా ఇంట్లోకి వెళ్లిపోయింది. వెంటనే ఆ ఇంటి యజమానురాలు గుర్తించి తలుపువేసి గడియపెట్టింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఇంటి చుట్టూ వలల ఏర్పాటు చేశారు. తొమ్మిది గంటల పాటు సాగిన ఈ ప్రయత్నంలో భాగంగా పులి వలకు చిక్కింది. వెంటనే అధికారులు పులిని బంధించి అడవిలో వదిలిపెట్టారు. బల్లార్ పూర్ ప్రాంత ప్రజలు చిరుత పులులు, పులుల నుంచి తమకు రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. 

Forest Official Captured Leopard hunt Dog in Chandrapur