Home జాతీయ వార్తలు కోహ్లీపై జాన్సన్‌ ఫైర్..!

కోహ్లీపై జాన్సన్‌ ఫైర్..!

Mitchell Johnson with Virat Kohliపెర్త్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో టెస్ట్‌లో వ్యవహరించిన తీరుపై ఆస్ట్రేలియా మాజీ మీడియం పేసర్ మిచెల్‌ జాన్సన్‌ మండిపడ్డాడు. కోహ్లీకి మర్యాద అంటే ఎంటో తెలియదని, సిల్లీగా ప్రవర్తిస్తుంటాడని పరుషంగా మాట్లాడాడు. పెర్త్ టెస్టులో టీమ్‌ పైన్‌, కోహ్లిల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం… టీమిండియా 146 పరుగుల తేడాతో పరాజయం పాలవ్వడం తెలిసిందే. అయితే, మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల సారథులు కరచాలనం చేసుకునే సందర్భంలో విరాట్ అమర్యాదకంగా ప్రవర్తించాడని ఫాక్స్‌ స్పోర్ట్స్‌కు రాసిన కథనంలో మిచెల్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి టీమ్‌ పైన్‌ పట్ల అలా వ్యవహరించాల్సింది కాదని, అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.. కానీ అతనివైపు చూడలేదు. ఇది అగౌరవపడచడమేనని, కోహ్లి చాలా మంది క్రికెటర్లకు దూరంగా వెళ్తుంటాడు. తాను విరాట్‌ కోహ్లిననే అహాన్ని ప్రదర్శిస్తాడు. అతనో వెర్రివాడు. నాకు తెలిసి అతనేం మారలేదు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక 2014 మెల్‌బోర్న్‌ టెస్ట్‌ సందర్భంగా కోహ్లి-జాన్సన్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Former Australian pacer Mitchell Johnson lashes out at Virat Kohli 

Telangana Breaking News