Friday, March 29, 2024

కర్నాటక మాజీ ఎంపి మృతి.. సిఎం సంతాపం

- Advertisement -
- Advertisement -

Former Belagavi MP S B Sidnal passed away

బెళ‌గావి: కర్నాటక ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ బెళగావి ఎంపి ఎస్.బి సిడ్నల్ మంగళవారం కన్నుమూశారు. సిడ్నల్ వయసు 85 ఏళ్లు. ఆయన వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, మనవరాళ్ళు ఉన్నారు. బెళగావిలోని సంపగావ్ నుండి వచ్చిన శణ్ముఖప్ప బసప్ప సిడ్నాల్ 1980 నుండి 1991 వరకు బెళగావి నుండి నాలుగుసార్లు ఎంపిగా పనిచేశారు. సిడ్నల్ మరణానికి కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప సంతాపం తెలిపారు. సిడ్న‌ల్ జీవితాంతం నీతి, నిజాయితీల‌తో బ‌తికిన రాజ‌కీయ నాయ‌కుడ‌ని యెడియూర‌ప్ప కొనియాడారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Former Belagavi MP S B Sidnal passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News