Thursday, April 25, 2024

ఎన్‌సిపిలో చేరిన బిజెపి మాజీ నేత

- Advertisement -
- Advertisement -

Former BJP leader Eknath Khadse joins NCP

ముంబయి: బిజెపికి రాజీనామా చేసిన మాజీమంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే(68) ఎన్‌సిపిలో చేరారు. ఎన్‌సిపి కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ అధినేత శరద్‌పవార్ సమక్షంలో ఎన్‌సిపి తీర్థం పుచ్చుకున్నారు. ఖడ్సేపై భూ ఆక్రమణ ఆరోపణలురావడంతో 2016లో ఫడ్నవీస్ మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. తనను మంత్రివర్గం నుంచి బయటకు పంపడం వెనుక ఫడ్నవీస్ కుట్ర పన్నారని ఖడ్సే ఆరోపిస్తున్నారు. బుధవారం బిజెపికి రాజీనామా చేసిన ఖడ్సే ఆ సందర్భంగా మాట్లాడుతూ ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాకు చెందిన ఖడ్సేను ఆ ప్రాంతంలో బలమైన నేతల్లో ఒకరిగా విశ్లేషకులు చెబుతున్నారు. బిజెపిని బలోపేతం చేసిన నేతల్లో ఒకరిగా కూడా ఖడ్సేకు పేరున్నది. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీలో ఎన్‌సిపికి భాగస్వామ్యమున్న విషయం తెలిసిందే.

Former BJP leader Eknath Khadse joins NCP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News