Home జనగామ జనగామలో మాజీ కౌన్సిలర్ ను గొడ్డలితో నరికి….

జనగామలో మాజీ కౌన్సిలర్ ను గొడ్డలితో నరికి….

Former counselor Murder in Jangaon

జనగామ: జిల్లా కేంద్రం నడిబొడ్డున ఓ మాజీ కౌన్సిలర్ గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాజీ కౌన్సిలర్ పులిస్వామి ప్రతి రోజు తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్తాడు. అతడి కదలికలపై కన్నేసిన దుండగులు గురువారం ఉదయం పులి స్వామి వాకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుగా వచ్చారు. అనంతరం అతడి తల, మెడపై గొడ్డలితో దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ ఘటనలో పులిస్వామి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.