Friday, March 29, 2024

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా….

- Advertisement -
- Advertisement -

Former Maha CM Ashok corona positive

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరుకోగా 1635 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో ముంబయిలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయిలోని కరోనా బాధితులు 30 వేలకు పైగా ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు కరోనా వైరస్ సోకింది. చవాన్‌కు ఎటవంటి లక్షణాలు లేకపోయిన కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చింది. దీంతో నాందేడ్‌లో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఉద్ధవ్ కేబినెట్ లో అశోక్  మంత్రిగా పని చేస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో 20 రోజులు చికిత్స తీసుకొని కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల లక్ష వరకు ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ప్రస్తుతం భారత్ కరోనా వైరస్ 1.38 లక్షల మందికి వ్యాపించగా 4024 మంది చనిపోయారు. కరోనా నుంచి 57 వేల మంది కోలుకున్నారు. కరోనా విస్తరించిన దేశాలలో భారత్ టాప్‌టెన్‌లో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 55 లక్షలకు చేరుకో 3.46 లక్షల మంది మృతి చెందారు. కరోనా నుంచి 23 లక్షల మంది కోలుకున్నారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
50,231 33,996 14,600 1,635
తమిళనాడు
16,277 7,841 8,324 112
గుజరాత్
14,063 6,793 6,412 858
ఢిల్లీ
13,418 6,617 6,540 261
రాజస్థాన్ 7,028 3,017 3,848 163
మధ్య ప్రదేశ్
6,665 2,967 3,408 290
ఉత్తర ప్రదేశ్
6,268 2,569 3,538 161
పశ్చిమ బెంగాల్
3,667 2,056 1,339 272
ఆంధ్రప్రదేశ్
2,780 883 1,841 56
వివిధ రాష్ట్రాలకు చెందిన వారు
2,642 2,642 0 0
బిహార్
2,574 1,861 702 11
కర్నాటక 2,089 1,391 654 42
పంజాబ్
2,060 122 1,898 40
తెలంగాణ
1,854 709 1,092 53
జమ్ము కశ్మీర్ 1,621 791 809 21
ఒడిశా
1,336 779 550 7
హర్యానా
1,184 403 765 16
కేరళ
848 322 520 6
అస్సాం
393 328 58 4
ఝార్ఖండ్
370 218 148 4
ఉత్తరాఖండ్ 317 255 58 3
ఛండీగఢ్ 262 79 179 4
ఛత్తీస్ గఢ్
252 188 64 0
హిమాచల్ ప్రదేశ్ 203 137 59 4
త్రిపుర
194 29 165 0
గోవా 66 50 16 0
లడఖ్
52 9 43 0
పుదుచ్చేరీ
41 29 12 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మణిపూర్ 32 30 2 0
మేఘాలయ
14 1 12 1
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 2 1 1 0
అరుణాచల్ ప్రదేశ్ 2 1 1 0
మిజోరం 1 0 1 0
సిక్కిం
1 1 0 0
మొత్తం 1,38,840 77,115 57,692 4,024
దేశాల వారిగా కరోనా వివరాల:

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News