Home తాజా వార్తలు విక్రమ్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం?

విక్రమ్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం?

Vikram Goud Not Respond on Gun Fire in Hyderabad,TS news,Telangana news,Telangana news Telugu,Latest TS news,Telangana news paper,TS news paper,Telugu news

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. విక్రమ్ కాల్పులకు తాజాగా రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం విక్రమ్ ఫోన్ లో డ్రగ్స్ కు సంబంధిచిన సమాచారం ఉండటమే. అంతేగాక మాదాపూర్ లోని ఓ పబ్ లో విక్రమ్ కు వాటా ఉండటంతో తన పేరు ఎక్కడ బయట వస్తుందోనన్న భయంతోనే ఆత్మహత్యాయత్నం చేసి ఉండోచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గత పదిరోజులుగా వస్తున్న డ్రగ్స్ కేసు సమాచారాన్ని విక్రమ్ తన మొబైల్ లో భద్రపరచుకున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ ఫోన్ లో 39 వాట్సాప్ మెసేజ్లుండగా ప్రతిదానిలో డబ్బులు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. వాటిలో బాధితులు రూ. 15 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 35 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ తండ్రి ఇచ్చిన ఇంటిని విక్రయించినట్లు సమాచారం.