Home తాజా వార్తలు మాజీ ఎంఎల్ఏ సున్నం రాజయ్య కన్నుమూత

మాజీ ఎంఎల్ఏ సున్నం రాజయ్య కన్నుమూత

Former MLA Sunnam Rajaiah passes away due to Corona

భద్రాద్రి కొత్తగూడెం: సిపిఎం మాజీ ఎంఎల్ఎ సున్నం రాజయ్య (59) కన్నుమూశారు. కరోనాతో ఎంఎల్ఎ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సున్నం రాజయ్య. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో రాజయ్యకు పాజిటివ్ నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం భద్రాచలం నుంచి విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో అర్థరాత్రి రాజయ్య మృతి చెందారు. భద్రాచలం నుంచి మూడు సార్లు ఎంఎల్ఎగా సున్నం రాజయ్య గెలుపొందారు. 1999,2004,2014లో సిపిఎం తరుపున ఎంఎల్ఎగా గెలిచారు. రాజయ్యకు ఇద్దరు కుమారులు, అతని అల్లుడికి కూడా కరోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో రాజయ్య కుమారులు, అల్లుడు చికిత్స పొందుతున్నారు. మాజీ ఎంఎల్ఎ మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజయ్య తన జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన నిరాడంబర రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. రాజయ్య కుటుంబసభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Former MLA Sunnam Rajaiah passes away due to Corona