Thursday, April 25, 2024

8 హాకీ జట్ల పేర్లు వారివే…

- Advertisement -
- Advertisement -

Former players name is Hockey team

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి, అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించటానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రిమియర్ హాకీ లీగ్ ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్ జట్టు క్రీడాకారుల జెర్సీని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఆగష్టు 1 నుంచి సికింద్రాబాద్ లోని జింఖానా మైదానంలో తెలంగాణ హాకీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభిస్తామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….  రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో క్రీడ మైదానాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడా పాలసీ రూపకల్పన లో హాకీ అభివృద్ధి పై ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్ సూచనలను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ హాకీ ప్రీమియర్ లీగ్ ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.  ఈ ప్రీమియర్ లీగ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ హాకీ క్రీడాకారులు 8 జట్లు గా విడిపోయి ఈ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటున్నారని తెలియజేశారు.

ఈ ప్రీమియర్ లీగ్ సుమారు 2 నెలల పాటు జరగుతుందని ఈ ప్రీమియర్ లీగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎంపిక అవుతారన్నారు. ఒక్కో జట్టుకు హాకీ క్రీడలో మన దేశం నుండి ఒలంపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుల గౌరవం కోసం వారి పేర్లతో జట్టును రూపొందించి ఆడించటం సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.

ఈ జట్లకు ఓలంపియన్స్ ముఖేష్ , దన్ పాజ్ పిల్లై, దిలిప్ టర్కి, పర్గత్ సింగ్, జఫర్ ఇక్బాల్, బాస్కరన్, సోమయ్య, సాహేద్ ల పేర్లతో జట్లు మధ్య లీగ్ లను తెలంగాణ క్రీడా శాఖ తరుపున తెలంగాణ హకీ అసోసియోషన్ ఈ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఒలంపియన్ ఎం. ముఖేష్, తెలంగాణ హాకీ అసోసియేషన్ ఛైర్మన్ కొండ విజయ్, రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, కోచ్ జావేద్, మేనేజర్ పాండు రంగారెడ్డి, తార సింగ్ అసిస్టెంట్ కోచ్, కెప్టెన్ అర్వింద్, ముఖేష్ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News