Home అంతర్జాతీయ వార్తలు నవాజ్ షరీఫ్ భార్యకు గుండెపోటు

నవాజ్ షరీఫ్ భార్యకు గుండెపోటు

navj-sharif

లండన్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్ కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. గొంతు క్యాన్సర్ సర్జరీ అనంతరం ఆమె ప్రస్తుతం బ్రిటన్ లో వైద్య సేవలను పొందుతున్నారు. కుల్సుమ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లండన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కుల్సుమ్ ను ఐసియులో ఉంచినట్టు ఆమె కూతురు మరియమ్ నవాజ్ చెప్పారు. తన తల్లి కుల్సుమ్ కోలుకోడానికి ప్రార్థనలు చేయాలని దేశ ప్రజలను ఆమె కోరారు.