Wednesday, April 24, 2024

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిబి సావంత్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former Supreme Court Justice PB Sawant Passes away

 

సిపిఐ చైర్మన్‌గా పనిచేసిన సావంత్

పుణె: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిబి సావంత్ సోమవారం ఉదయం పుణెలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. మహారాష్ట్రలోని పుణెలో 2017 డిసెంబర్ 31న నిర్వహించిన ఎల్గార్ పరిషత్ సదస్సు సహ నిర్వాహకులలో జస్టిస్ సావంత్ ఒకరు. 2002 గుజరాత్ అల్లర్లపై విచారణ జరిపిన కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా కూడా జస్టిస్ సావంత్ సేవలందచేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు గుండెపోట్లు జస్టిస్ సావంత్ మరణించినట్లు ఆయన కుమార్తె సుజాత మానె తెలిపారు. మంగళవారం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. 1930 జూన్ 30న జన్మించిన సావంత్ 1957లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1973లో ఆయన బొంబాయి హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 1989లో జస్టిస్ సావంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1995లో పదవీ విరమణ చేసిన జస్టిస్ సావంత్ తన చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో చురుకుగా కొనసాగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News