Friday, March 29, 2024

యుపిలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -
Former Unnao MP Annu Tandon Resigns From Congress
మాజీ ఎంపి అన్ను టాండన్ రాజీనామా

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుడెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఉన్నావ్ మాజీ ఎంపి అన్ను టాండన్ గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట స్థాయి నాయకత్వంతో విభేదాల కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపానని, వెంటనే దీన్ని ఆమోదించాలని కోరానని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. 2009లో ఉన్నావ్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున అన్ను టాండన్ ప్రాతినిధ్యం వహించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని బంగర్మావ్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగనున్నది.

గడచిన 15 ఏళ్ల కాలంలో తనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి మంచి సలహాసూచనలు, అభిమానం లభించాయని ఆమె తెలిపారు. అయితే గత కొన్ని నెలలుగా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి తనకు ఎటువంటి మద్దతు లభించడం లేదని ఆమె ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇటీవలి కాలంలో కేవలం సోషల్ మీడియా మీదనే ఆధారపడుతూ గొప్పలు పోతోంది తప్ప పార్టీలో నెలకొన్ని విభేదాల గురించి కాని, డూరమవుతున్న ఓటర్ల గురించి కాని పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ విషయాల గురించి తాను పార్టీ యుపి ఇన్‌చార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా దృష్టికి తీసుకెళ్లానని, ఈ విషయాలన్నీ పార్టీ అధ్యక్షురాలికి సంపూర్ణంగా తెలుసునని, వాటిని ఆమె చక్కదిద్దుతారని చెప్పినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని టాండన్ చెప్పారు. తన సిద్ధాంతాలు, నైతిక నిబద్ధత పార్టీ సీనియర్ నాయకత్వానికి కట్టుబడి ఉన్నాయని, తన రాజీనామాతో వాటిలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో సంప్రదిస్తానని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News