Friday, March 29, 2024

ఇ-రేస్.. యువత జోరు

- Advertisement -
- Advertisement -

నగర ప్రజలు ముఖ్యంగా యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇ-కారు రేస్ గ్రాండ్ సక్సెస్ అయింది. సెలబ్రిటీలు సందడి చేశారు. సచిన్, ఆనంద్ మహీంద్రా, నాగార్జున వంటి ప్రముఖులు రేస్‌ను ఎంజాయ్ చేశారు. యువతీయువకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తింది. మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులతో కలిసి రేసును వీక్షించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ ఇవెంట్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినందుకు గ్రేటర్ వాసులకు కెటిఆర్ సారీ చెప్పారు.

హైదరాబాద్ :వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన ఈ రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూ సుకెళ్లారు. 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లు ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలవగా, రెండో స్థా నంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. ఈ సందర్భంగా విన్నర్‌లకు మంత్రి కెటిఆర్ బహుమతి అందజేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి ఫార్ములా ఈ రేసు హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందని ఆయన పే ర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్‌తో హై దరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగిందని ఆయన వివరించారు. ఈ రేసింగ్ చూసేందుకు 30 వేల టిక్కెట్ల విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. పది చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
సినీ, క్రీడా ప్రముఖులు హాజరు
సాగరతీరాన జరిగిన ఫార్ములా ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కెటిఆర్‌తో పాటు సినీ ప్రముఖులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, నవదీప్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు నాగ్ అశ్విన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, క్రికెటర్ సచిన్, చాహల్, ధావన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు ఫార్ములా ఈ రేసును వీక్షించారు. కాగా, కార్ల వేగం ప్రేక్షకుల కేరింతలతో సాగరతీరం హోరెత్తిపోయింది.
మరిన్ని రేస్‌లను నిర్వహిస్తాం:
భారత్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని ఎఫ్‌ఐఏ ప్రెసిడెంట్ మహమ్మద్ సులేమాన్ పేర్కొన్నారు. భారత్‌లో మోటార్ స్పోర్స్‌ను నిర్వహించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. భారత్‌లో ఈ స్పోర్ట్ హై లెవెల్లో ఉందని, భవిష్యత్‌లో రేసింగ్ నిర్వహించడానికి మరికొన్ని ట్రాక్‌లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పుడు నిర్వహించినట్టే ఎఫ్‌ఐఏ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జరగాలి: గోపీచంద్
భారత దేశంలో ఇలాంటి రేసులు రావడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి అంతర్జాతీయ రేసింగ్‌లో భారత్‌లోనూ, అందులోను హైదరాబాద్‌లో మరిన్ని జరగాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఫార్ములా ఈ రేస్ పోటీలకు అనేక దేశాలు శాశ్వత హోస్ట్‌గా వ్యవహారిస్తున్నాయి. అందులో ప్రధానంగా దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జకార్తా, సియోల్ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ పోటీలు జరిగాయి. ఇక మీదట భారతదేశం నుంచి హైదరాబాద్ ఈ నగరాల జాబితాలో చేరనుందని నిర్వాహకులు వెల్లడించారు. కాగా ఫార్ములాలో మొత్తం 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేస్‌లో రేసర్ పొందిన పాయింట్ల వారీగా సీజన్ల వారీ పాయింట్లు కలిపి, చివరకు ప్రపంచ చాంపియన్‌ను ప్రకటిస్తారు.
తరువాత పోటీలు దక్షిణా ఆఫ్రికాలో…
పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు కాకుండా కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్ చేయడమే ‘ఫార్ములా ఈ రేసింగ్’ ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యం. అనేక రాష్ట్రాలు పోటీపడినా మంత్రి కెటిఆర్ చొరవతో హైదరాబాద్ వేదికగా జరిగాయి. 2014 బీజింగ్ ఒలింపిక్స్ గ్రౌండ్ దగ్గర మొట్టమొదటి ‘ఫార్ములా ఈ రేస్’ జరిగింది. తదుపరి పోటీలు దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News