చెన్నయ్ : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్‌బేడీకి వాట్సాప్‌లో అశ్లీల వీడియో వచ్చింది. ఈ వీడియోను పంపించాడనే ఆరోపణలతో శివకుమార్ అనే రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడం కోసం ఆమె అన్ని శాఖల అధికారులతో ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ వాట్సాప్ ద్వారానే అన్ని శాఖల అధికారులకు ఆమె ఆదేశాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సహకార సంఘాల రిజిస్ట్రార్ పేరుతో ఈ గ్రూపునకు మూడు పోల్డర్లలో ఓ వీడియో వచ్చిందని , అందులో 30 అసభ్య మెసేజ్‌లు , వీడియోలు ఉన్నాయని సిఎస్ మనోజ్ ప్రీతా తెలిపారు. దీనిపై సీనియర్ ఎస్పి రాజీవ్‌రంజన్ విచారణ జరిపారు. ఈ క్రమంలో శనివారం రిజిస్ట్రార్ శివకుమార్‌ను అరెస్టు చేశారు.