Home జోగులాంబ గద్వాల్ సర్కారు భూముల్లో… అవినీతి పునాదుల పెకలింపు

సర్కారు భూముల్లో… అవినీతి పునాదుల పెకలింపు

Building-Collapsed

గద్వాలప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాల్లో భూబకాసురలపై జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ కొరఢా ఝలిపించారు… ఇంత కాలం ఖాళీగా కనపడిన సర్కారు భూములను బడాబాబులు తమ అధికార బలం తో చెరపట్టారు.. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.. ఫలితంగా అక్రమార్కులకు ఆడిం ది ఆట పాడింది పాటగా తయ్యారైంది… అయితే నూతన జిల్లా ఏర్పాటు అనంతరం జిల్లా కలెక్టర్‌గా వచ్చిన రజత్‌కు మార్‌సైనీ తనదైన శైలీలో అక్రమార్కుల భరతం పడుతూ గాడి తప్పిన పాలనను పట్టాలెక్కించే పనుల్లో నిమగ్నమై య్యారు..

ఇందులో భాగంగా ఒక్కో శాఖపై సమగ్ర నివేధి క తెప్పించుకుని క్షుణ్ణంగా అవగాహన వచ్చిన తరువాత వాటి భరతం పట్టేందుకు నడుం బిగించారు… ఈక్రమం లో మనతెలంగాణతో పాటు పలు దిన పత్రికల్లో కూడ సర్కారీ భూముల కబ్జాలపై వరుస కథనాలు ప్రచూరితమ వుతూ వస్తున్నాయి.. వీటిన్నింటిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.. దినపత్రికల్లో వచ్చిన భూఅక్రమాలపై ఎప్ప టికపుడు సంబంధిత అధికారులతో సమగ్ర నివేధిక తెప్పిం చుకుంటూ వాటిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించా రు. ఈక్రమంలో భూకబ్జాలకు పాల్పడిన బడాబాబులు తమ పలుకుబడితో అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నప్పటికీ కలెక్టర్ ముందు వారి పాచికలు పారడం లేదు… శనివారం ఏకంగా కబ్జాకు గురైన భూములను స్వాదీనం చేసుకునే క్రమంలో అక్రమ నిర్మాణాల కూల్చి వేసే చర్యలకు ఉపక్రమించడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది.

ప్రక్షాళన దిశగా.. వడి వడిగా..

గత రెండు నెలలుగా మనతెలంగాణ దిన పత్రికల్లో జిల్లా వ్యాప్తంగా కబ్జాకు గురైన సర్కారీ భూములపై వరుస కథ నాలను ప్రచూరిచ్చడం జరిగింది.. దీనిపై జిల్లా ఉన్నతాధి కారి అయిన కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ స్పందిస్తూ వెంటనే కఠిన చర్యలు చేపడుతున్నారు.

*మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో సర్కారి భూ మిని ఏకంగా కబ్జా పెట్టి లీజుకిచ్చి దర్జాగా అక్కడ ఇటుక బట్టీ వ్యాపారాన్ని నిర్వహిస్తు న్నారు. ఈ భూదంధాపై మనతెలంగాణలో కథనం ప్రచూరితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కబ్జాకు గురైన భూమిని స్వాదీ నం చేసుకోవడమే కాకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకున్నారు.

*వడ్డేపల్లి మండలం సర్వే నంబరు 146 2-12ఎకరాలు కొందరు బడాబాబులు కబ్జా పెట్టి ఏకంగా ప్లాట్లను తయారు చేసి విక్రయించే పని చేపట్టారు. ఈఅవినీతి భాగోతాన్ని మనతె లంగాణ దినపత్రిక వెలుగులోకి తీసుకురా వడం జరిగింది. దీంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సంబంధిత తహశీల్దార్ చంద్ర మౌళిని విచారణకు ఆదేశించారు.

*అధేవిధంగా గట్టు మండలం, గద్వాల మం డల శివారుల్లో కూడ ప్రభుత్వ భూమి, డొంగు రస్తాలన కబ్జా పెట్టిన వైనంపై కూడ కొరఢా ఝలిపించారు.

*ఇటిక్యాల మండలం కొండేరు గ్రామ శివా రులో సర్వే నంబరు జాతీయ రహదారిని ఆను కుని సర్వేనంబరు 311పక్కన ఉన్న కోట్లు వి లువ చేసే 33 ఫీట్ల బండ్ల బాటను సైతం అధి కార పార్టీకి చెందిన అనుచరులుగా చెలమణీ అవుతున్న వ్యక్తులు కబ్జా పెట్టారు. ఈవ్యవహా రంపై జేసీ, రెవెన్యూ బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలకు ఆదేశించారు.

*ప్రత్యేక కమిటీ……
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అక్రమార్కుల చేతుల్లో ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ దీనిపై పూర్తి స్థాయిలో చర్య లు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. సమగ్ర నివేధిక త యారు చేసి ఆదివారం ముఖ్యమంత్రితో జరి గిన సమీక్షలో అక్రమార్కుల చిట్టా మొత్తం బయట పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా విలువైన ప్రభుత్వ భూములను కబ్జా పెట్టిన వారిలో అధికంగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీరు ఎవరు అధికారంలో ఉంటే అక్కడ ఉంటూ అక్రమ సంపాదన ఆర్జిస్తున్నట్లు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే అక్రమార్కులు ఎంతటి వారైనప్పటికీ వదల వద్దంటూ సీఎం ఈసందర్భంగా వ్యాఖ్యానిం చినట్లు సమాచారం. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి దర్జాగా ఉన్నారో వారిపై రెవెన్యూ చట్ట ప్రకా రం చర్యలు తప్పవన్నది స్పష్టమవుతుది.