Home జాతీయ వార్తలు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం : నలుగురు చిన్నారులు మృతి

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం : నలుగురు చిన్నారులు మృతి

Four Children Died In Fire Accident At Bhopalభోపాల్‌ :  భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భోపాల్ లోని  కమలా నెహ్రూ ఆస్పత్రిలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు చనిపోయారు. మంగళవారం ఉదయం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో మంటలు చెలరేగి ఆసుపత్రి మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 36 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారని, నలుగురు మాత్రం చనిపోయారని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అదికారులను ఆదేశించారు