Thursday, March 28, 2024

యాదాద్రి జిల్లాలో నలుగురికి కరోనా

- Advertisement -
- Advertisement -

corona

 

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని రోజులు గ్రీన్ జిల్లాగా ఉన్న యాద్రాద్రి కరోనా కేసులు వెలుగు చూడడంతో ఎం ఆత్మకూరు మండలాన్ని రెడ్ జోన్ ప్రకటించే అవకాశం ఉంది. ఎం ఆత్మకూర్ మండలంలో మూడు కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైందని కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. బాధితులు ముంబయి నుంచి స్వస్థలాలకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆత్మకూరు మండలాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 1163 కేసులు నమోదు కాగా 30 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా నుంచి 751 మంది కోలుకోగా 382 మంది చికిత్స పొందుతున్నారు. భారత దేశంలో కరోనా వైరస్ 63,400 మందికి వ్యాపించగా 2019 మంది చనిపోయారు. ఇండియాలో కరోనా నుంచి 19,421 మంది కోలుకోగా 41866 మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 41 లక్షలకు చేరుకోగా 2.80 లక్షల మంది చనిపోయారు.

రాష్ట్రాలు&కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు సంఖ్య
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
20,228 15,649 3,800 779
గుజరాత్
7,797 5,234 2,091 472
ఢిల్లీ 6,923 4,781 2,069 73
తమిళనాడు 6,535 4,667 1,824 44
రాజస్థాన్ 3,741 1,458 2,176 107
మధ్య ప్రదేశ్
3,457 1,766 1,480 211
ఉత్తర ప్రదేశ్
3,373 1,800 1,499 74
ఆంధ్రప్రదేశ్ 1,980 1,010 925 45
పశ్చిమ బెంగాల్
1,786 1,243 372 171
పంజాబ్ 1,762 1,574 157 31
తెలంగాణ 1,163 382 751 30
కర్నాటక
847 410 405 31
జమ్ము కశ్మీర్
836 459 368 9
హర్యానా
675 376 290 9
బిహార్ 629 306 318 5
కేరళ 506 17 485 4
ఒడిశా 352 281 68 3
ఛండీగఢ్
169 143 24 2
ఝార్ఖండ్
156 75 78 3
త్రిపుర 135 133 2 0
ఉత్తరాఖండ్
67 20 46 1
అస్సాం 62 26 35 1
ఛత్తీస్ గఢ్
59 16 43 0
హిమాచల్ ప్రదేశ్
52 11 35 3
లడఖ్
42 24 18 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ
13 2 10 1
పుదుచ్చేరీ 10 2 8 0
గోవా 7 0 7 0
మణిపూర్ 2 0 2 0
మిజోరం 1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్
1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
1 1 0 0
మొత్తం
63,400 41,866 19,421 2,109
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News