Home జాతీయ వార్తలు ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి

ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి

Compound Wallపశ్చిమ బెంగాల్‌ : ఉత్తర 24 పరగణ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం ఘటన చోటు చేసుకుంది. కచువాలోని ఓ ఆలయంలో జరుగుతున్న  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై సిఎం మమతా బెనర్జీ  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ఇస్తామని ఆమె తెలిపారు. మృతుల కుటంబాలకు ఆమె సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనతో ఆ దేవాలయంలో వేడుకలను రద్దు చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Four Dead In Compound Wall Collapse