Home కరీంనగర్ రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Four deaths belong to the same family in road accident
సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. హైద్రాబాద్ నుండి మంథనికి తిరిగి టిఎస్ 02 ఈన్ 3580 అనే కారులో వస్తుండగా కాట్నపల్లి వద్ద ఆగి ఉన్న లారీకి కారు అదుపు తప్పి ఢీకొనడంతో చదువాల అరుణ్‌కుమార్(35), ఇతని భార్య సౌమ్య(30), కుమారుడు అఖిల్(9), కూతురు సాన్వి(4)లు మృతిచెందారు. అరుణ్‌కుమార్ మంథనిలో క్రిష్ణవేణి ట్యాలెంట్‌స్కూల్ బ్రాంచిని నిర్వహిస్తున్నారు. ఇతని స్వాగ్రామం సుల్తానాబాద్. అరుణ్‌కుమార్ సోదరుడు సాయికుమార్‌తో పాటు బంధువైన ఓం ప్రకాశ్‌లను హైద్రాబాద్‌లో కాలేజీల్లో చేర్పించేందుకు గరువారం మధ్యాహ్నం 1 గంటలకు మంథని నుండి హైద్రాబాద్‌కు కుటుంబంతో సహా కారులో బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ఉదయం 8గంటల వరకు హైద్రాబాద్‌కు మళ్లి వస్తానని సోదరుడు సాయికుమార్‌కు చెప్పి మంథనికి కారులో గురువారం రాత్రి బయలు దేరారు. సుమారు రాత్రి 12:30 నుండి 1 గంట సమయంలో కారు అతివేగముగా ఉండటంతో అదుపు తప్పి ఆగి ఉన్న ఏపీ 16 టీటీ 8055 అనే నెంబర్ గల లారీకి వెనుక భాగంలో ఢీకొట్టి లోనికి దూసుకుపోవడంతో కారులో ఉన్న వారి సౌమ్య, సాన్విల తలలకు లారీ వెనుకభాగం వేగంగా తగలడంతో తలలు పగిలి మెదడు చిట్లిపోయింది. నలుగురికి బలమైన గాయాలతో  నుజ్జు నుజ్జు అయి కారులో ఇరుక్కొని మృతిచెందారు. పోలీస్ యంత్రాంగం సమాచారాన్ని అందుకొని పెద్దపల్లి ఏసిపి హబీబ్‌ఖాన్, సుల్తానాబాద్ సీఐ అడ్లూరి రాములు, ఎస్‌ఐ రాజేశ్‌లతో పాటు సిబ్బంది చేరుకొని కారులోని మృతదేహాలను బయటికి తీసేందుకు సుమారు గంటన్నర పైగా సమయం పట్టింది. హెడ్‌కానిస్టేబుల్ రవిందర్‌తో పాటు గ్యాస్ కట్టర్ సాయి, సందీప్‌లతో పాటు నాగరాజు, మునీందర్, అంజయ్య,రాజు అనే సహాయకులతో ప్రమాదంలోని కారునుండి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుల్తానాబాద్‌లో తవుడు లోడ్ చేసుకోని లారీని ఆంధ్రాప్రాంతానికి చెందిన ఏలురులోని ఆదిత్యా ఫ్యాక్టిరికి వెళ్లెందుకు వేబ్రిడ్జి వద్ద వేబిల్ తీసుకోని బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న లారీకి ఈ కారు ఢీకొనడంతో ప్రామాదం జరిగింది. లారీ డ్రైవర్ బల్లారీ నాగరాజు. కారు అతివేగంగా లారీకి వెనుకభాగంలో ఢీకొన్న ప్రమాదంలో లారీ గేర్‌బాక్స్, క్లచ్‌ప్లేట్స్ పగిలిపోవడంతో పాటు కారు తునాతుకనకలు అయిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైంది. మృతుడు చదువాల అరుణ్‌కుమార్ కారు నడుపడంతో అలసిపోయి నిద్ర సమయం అయినందున కూడా ఈ ప్రమాదం కారణం అయిందని చెప్పవచ్చును. మంథనిలో స్కూల్ నిర్వహిస్తున్న మృతుడు శుక్రవారం ఉదయం కొత్తగా కొనుగోలు చేసిన స్కూల్ బస్సును పూజచేసి ప్రారంభించి తిరిగి మళ్లి హైద్రాబాద్‌కు వెళ్లేందుకు సిద్దమై వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు అరుణ్‌కుమార్ తండ్రి లక్ష్మిరాజం గోదావరిఖని సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. తల్లి రాజేశ్వరితో పాటు హైద్రాబాద్ నుంచి తిరిగి వచ్చిన సాయికుమార్‌తో పాటు బంధువులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోదిస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు  సుల్తానాబాద్‌కు చేరుకోని మృతదేహాలను పరిశీలించి కుటుంబాన్ని పరమార్శించారు. సుల్తానాబాద్ సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్ పోస్టుమార్డం నిర్వహణతో పాటు అంత్యక్రియలకు ఏర్పాట్లను చేశారు. పెద్దపల్లి డిసిపి సుదర్శన్‌గౌడ్, ఏసిపి హబీబ్‌ఖాన్‌లతో పాటు సిఐ అడ్లూరి రాములు, ఎస్‌ఐ రాజేష్‌లు ప్రమాద సంఘటన సరిగిన తీరును పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి కారణం అతివేగమే ప్రమాదన కారణమని డిసిపి సుదర్శన్‌గౌడ్ అన్నారు. లారీ డ్రైవర్ బాల్లారి నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిసిపి సుదర్శన్‌గౌడ్ తెలిపారు.