Home తాజా వార్తలు బోల్తాపడిన లారీ.. నలుగురి మృతి, 30 మందికి గాయాలు

బోల్తాపడిన లారీ.. నలుగురి మృతి, 30 మందికి గాయాలు

Accidentకడప: జిల్లాలోని సి.కె. దిన్నె మండలం రాచోటి ఘాట్ వద్ద సోమవారం వెకువజామున లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మంది గాయాలపాలయ్యారు. పెండ్లిమర్రి మండలం పొలతల దేవాలయానికి దర్శనార్థం వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా రామాపురం మండలం నల్లచెరువు వాసులని సమాచారం. క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.