Home తాజా వార్తలు ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెలగామ్ జిల్లా రాయబాగ్‌లో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి రైలు కిందపడి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల సమస్య ఎక్కువగా ఉండడంతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.