Home ఆదిలాబాద్ నలుగురు పేకాట రాయుళ్లు అరెస్టు

నలుగురు పేకాట రాయుళ్లు అరెస్టు

Gamblers

 

ఆదిలాబాద్ : శుక్రవారం అర్థరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణంలోని మ్యాండీ క్యాప్ కాలనీలో పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు అరెస్టు చేశారు. సిసిఎస్ సిఐ ఎం రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడుతున్న వ్యక్తుల సమాచారం స్థానికులచే డయల్ 100 ద్వారా అందగా వెంటనే అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ అధికారులు పేకాట స్థావరాలపై దాడి చేసి మ్యాండీ క్యాప్ కాలనీకి చెందిన గుమ్ముల సంతోష్, కన్యవార్ గణేష్, పోత గంటి వార్ రాజ్‌కుమార్, కర్నాల సత్తయ్య లను అరెస్టు చేసి వారినుండి పేకాట ముక్కలు, 12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి దర్యాప్తు కోసం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు నిందితులను అప్పగించారు. ఈ సందర్భంగా ఒకటో పట్టణ ఎస్‌ఐ జాదవ్ గుణవంతరావు మాట్లాడుతూ పేకాటరాయుళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.

Four Gamblers Arrested