Home నాగర్ కర్నూల్ ఒకే ఈతలో నాలుగు మేక పిల్లల జననం

ఒకే ఈతలో నాలుగు మేక పిల్లల జననం

Goat

ఒకే ఈతలో మేక నాలుగు మేక పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన పదర మండల కేంద్రంలో చోటు చేసు కుంది.వివరాలు పదర మండల కేంద్రంలో శనివారం తెల్లవారు జామున వ్యవసాయ రైతు కూలి ఎడ్మ వెంకటయ్య యాదవ్ కు చెందిన పెంపుడు మేక ఒకే ఈతలో నాలుగు మేక పిల్లలకు జన్మనిచ్చింది.అది గమనించిన స్థానికులు,చుట్టు పక్కల వారు సంభ్రమాశ్చర్యానికి గురై ఇలా చూడటం మొదటి సారి అని,ఇలా జరగడం చాలా అరుదు అని వాపోయారు.ఈ వింతను చూడటానికి స్థానికులు తండోపతండాలుగా వచ్చి వెలుతున్నారని మేక యజమాని ఎడ్మ తిరుపతయ్య యాదవ్ తెలి పారు.సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న మనతెలంగాణ కెమెరా ఈ దృష్యాన్ని క్లిక్ మనిపించింది.