Home ఖమ్మం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి

 

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు దగ్గర ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు నలుగురు జీళ్ల చెరువుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది కూలీలు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు.  ట్రాక్టర్ ప్రమాదంపై ఎంపి నామా నాగేశ్వర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు నామా ఆదేశించారు.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Four Members Dead in Tractor accident in Kusumanchi