Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

accident

 

చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెవిపల్లి మండలం మహల్‌ క్రాస్‌రోడ్డు వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసి బస్సు ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Four People dead after RTC Bus rammed a Car