Saturday, April 20, 2024

నగదుతో పరారైన నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Four persons absconding with cash were arrested

పరారీలో ఇద్దరు నిందితులు
రూ.28లక్షల నగదు,బైక్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఈస్ట్‌జోన్ డిసిపి సునీల్ దత్

హైదరాబాద్: నగల వ్యాపారిని బురిడీ కొట్టించి నగదుతో పరారైన నలుగురు నిందితులను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.28,19,000 నగదు, బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌జోన్ డిసిపి సునీల్ దత్ బుధవారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చార్మినార్, మీరాంలాం మండికి చెందిన మహ్మద్ సుల్తాన్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు గతంలో పలు నేరాలు చేయడంతో పోలీసులు 9కేసులు నమోదు చేశారు. భవానీనగర్‌కు చెందిన మహ్మద్ సర్ఫరాజ్ ఖాన్, గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, రెయిన్‌బజార్‌కు చెందిన షేక్ ముబీన్ అలియాస్ షేక్ ముజామిల్, మహ్మద్ సోహెబ్ కలిసి నగదుతో పరారయ్యారు.

నగల వ్యాపారి అశోక్ బన్సాల్ వద్ద మహ్మద్ సుల్తాన్ పనిచేస్తున్నాడు. ఈ నెల 3 తేదీన బంగారం కొనుగోలు చేసేందుకు డుబ్బలు తీసుకుని అశోక్ బన్సాల్ , సుల్తాన్‌తో కలిసి గౌలిగూడకు వచ్చాడు. క్యాష్ బ్యాగును బైక్‌లో పెట్టి షాపులోకి వెళ్లాడు. ఇది మంచి అవకాశంగా భావించిన సుల్తాన్ డబ్బుల బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యాడు. సుల్తాన్ స్నేహితులు సర్ఫారాజ్ ఖాన్, ఇమ్రాన్, ముబీన్, సోహెబ్ కలిసి ముంబాయికి వెళ్లారు, అక్కడి నుంచి ఢిల్లీ, జమ్ము, పంజాబ్‌కు జాల్సా చేశారు. అక్కడి నుంచి ఇద్దరు నిందితులు సర్ఫరాజ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ నగరానికి తిరిగి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సర్ఫరాజ్‌ఖాన్‌పై 9కేసులు ఉన్నాయి, పోలీసులు పిడి యాక్ట్ పెట్టి గతంలో రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి, తదితరులు నిందితులను పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News