Home తాజా వార్తలు రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపిఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపిఎస్‌ల బదిలీ

vk-singhహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నలుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సంతోష్ మెహ్రా(1987 బ్యాచ్) స్థానంలో గతంలో జైళ్లశాఖ డిజిగా పనిచేసిన (1987 బ్యాచ్) వికెసింగ్‌ను నియమించింది. కాగా సంతోష్‌మెహ్రాను డిజిపి కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. అలాగే ఫైర్ సేఫ్టీ డిజి గోపికృష్ణ (1987 బ్యాచ్)స్థానంలో సంజయ్‌కుమార్ జైన్(1997 బ్యాచ్)రె నియమించింది. అలాగే గోపికృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిసనర్‌గా బదిలీ చేసింది.

Four Senior IPS Officers Transferred in Telangana