Home జాతీయ వార్తలు బావిలో పడిన స్కూల్ వ్యాను : నలుగురు విద్యార్థులు మృతి

బావిలో పడిన స్కూల్ వ్యాను : నలుగురు విద్యార్థులు మృతి

Road Accidentభోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లా  రిచ్చోడాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ వ్యాను అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఘటనాస్థలిలోనే నలుగురు విద్యార్థులు చనిపోయారు. 21 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Four Students Dead In Road Accident At Madhya Pradesh