Home హైదరాబాద్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

famly-Suside-images

మన తెలంగాణ/సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకు న్నారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్ళితే వెస్ట్ బెంగాల్‌కు చెందిన గోపాల్‌దాస్ తన కుటుంబంతో కలిసి సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్ లో నివాసముంటున్నాడు. అతనికి భార్య దీప, కొడుకు టికిలి దాస్ ( 5), ఒక పాప ( 5 నెలలు ) ఉన్నారు. దంపతులు తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాము విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరానప్పటికి ఆర్థిక ఇబ్బందుల మూలంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. జనరల్ బజార్‌లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన అనేక మంది బంగారు నగలు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మృతదేహాలను గాంధీఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.