Tuesday, March 21, 2023

బల్దియాలోకి నాలుగు గ్రామాలు విలీనం

- Advertisement -

 

samstha2*అభివృద్ధి కొరకై అధనంగా రూ.15 కోట్లు మంజూరు చేసిన మంత్రి కెటిఆర్
*రానున్న 6 నెలల్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు పక్కా ప్రణాళికలు
*సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నాలుగు లైన్ల రోడ్లతో పట్టణ రూపురేఖల్లో మార్పు
*ఇంటింటికి మిషన్‌భగీరథ పైపులైన్లు వేసి రెండో అంతస్తు కూడా తాగునీరు
*మున్సిపాలిటీ విస్తరణకు చుట్టూ 3కి.మీ.లోపు గ్రామల చేర్పుకోరకై సభ్యుల ఆమోదం
*30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పట్టణాభివృద్ధి చేసుకుందాం
*అత్యవసర సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రానికి నోచుకుంది. అ యినప్పటికీ రాష్ట్రంలో కొన్ని జిల్లాలను రద్దుచేస్తామన్నా జాబీతాలో మెదక్ జిల్లా ఉందని ఇక్కడి ప్రాంత ప్రజల్లో తీ వ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నెల 17వ తేదీన ము ఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యాటనలో భాగంగా జిల్లాకు కలెక్టరేట్‌ను పైనల్ చేశారు. దీంతో ఉంటుందో.. పోతుందోనన్నా స్థానిక ప్రజల సంశయానికి తెర తొలగిపోయింది. తూప్రాన్‌లో 50 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయాలకు స్థలా న్ని సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీం తో ఒక్క రోజులో జిల్లా కేంద్రంలో మార్పులు వచ్చాయి. అధికారులలో హడావుడి మొదలైంది. కార్యాలయాలకు కావాల్సిన 86 ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ క్రమంలో జిల్లాలో గల ఏకైక మున్సిపాలిటీ మెదక్. దీనిని అన్ని హంగులతో, అవసరమైన పూర్తి వసతులతో అభివృద్ధి చేసుకునే దిశగా మెదక్ బల్దీయా అడుగులు వేస్తుంది. జిల్లాలో గల ఏకైక మున్సిపాలిటి రూపురేఖలు మారనున్నాయని, చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో గల గ్రామాలను వీలినం చేసుకొని పట్టణాన్ని విశాలమైన సుందర నగరంగా తీర్చిదిద్దుతామ ని మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. జిల్లాను ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి, మున్సిపాలిటీ అభివద్ధి కోరకై 15 కోట్ల రూపాయలు కేటాయించినందుకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌కు, పట్టణాభివృద్ధికి నిధులను కేటాయింపజేసినందు కు ఉపసభాపతి శ్రీమతి పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల చేర్పు గురించి సభ్యుల అనుమతి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే నాలుగు లైన్ల రహదారుల పనుల నిమిత్తం రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయని అన్నారు. మంత్రి కేటాయించిన 15 కోట్లలో 5 కోట్ల నిధులను తక్షణమే అన్ని వార్డులలో గల డ్రైనేజీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మిగతా 10 కోట్ల రూపాయలను మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కడ ఏ అవసరముంటే అధికారులు అట్టి వా ర్డుల్లో పర్యావేక్షించి కావాల్సిన నిధులను అభివృద్ధి కోరకు కేటాయించ డం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డంపుయా ర్డు తదితర పనులు ఖచ్చితంగా నిర్మిస్తామన్నారు. ఈ తరుణంలో మున్సిపాలిటీ విస్తరణకు చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో గల నాలుగు గ్రామాలైన మంబోజిపల్లి, పిల్లికోట్యాల, అవుసులపల్లి, ఔరంగాబాద్‌ల ను పట్టణంలో చేర్చుకునేందుకు మున్సిపాలిటీ రూల్స్ 2006 ప్రకారం వార్డు సభ్యుల యొక్క తీర్మాణాన్ని తీసుకున్నారు. అభివృద్ధి దృష్ట్యా పై గ్రామాలను మున్సిపాలిటీలో కలుపవల్సినందున సభ్యుల ఆమోద ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రానున్న ఆరు నెలల్లో పట్టణంలోని ఏ అభివృద్ధి పనికూడా పెండింగ్‌లో లేకుండా అన్ని పనులను పూర్తి చేస్తామని తెలియజేశారు. పట్టణంలో స్వ చ్ఛ స్వరేక్షణ్ కార్యక్రమంలో అధికారులు పూర్తి స్థాయిలో ప్రజల సహాకారంతో విజయవంతంగా పనిచేశారని మున్సిపల్ కమిషనర్‌ను, సిబ్బంది ఈ సందర్భంగా చైర్మేన్ అభినందించారు. ఇంకా పట్టణంలో అభివృద్ధి పనులకు నిధుల కోరకు ఎటువంటి డోకాలేదని, త్వరలో 14వ ఆర్థిక సంఘ నిధులు కూడా రానున్నాయని, అవికూడా పట్టణాభివృద్ధికి కేటాయించి అవసరమున్నచోట వినియోగిస్తామన్నారు.
మిషన్‌భగీరథ పైపులు సరిగా వేయడం లేదు : సభ్యుల ఆరోపణ
పట్టణాభివృద్ధిలో భాగంగా మిషన్‌భగీరథ పైవులను అధికారులు ప్రతి ఇంటింటి వరకు చేర్చడం లేదని చైర్మన్ దృష్టికి సభ్యులు తీసుకురాగా… అందుకు సమావేశానికి హాజరైన ప్రజారోగ్య శాఖ ఇఇ వీరప్రతాప్ సమాధానమిస్తూ పట్టణంలో మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి తాగు నీ రందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే వార్డు సభ్యులు సూచించిన యెడలా పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో 48 మీటర్ల ఎత్తులో 4,700 కిలో లీటర్ల సా మర్థం గల ట్యాంక్‌లను నిర్మిస్తున్నామన్నారు. దీని ద్వారా పట్టణంలోని రెండవ అంతస్తులో నివసిస్తున్నవారికి కూడా పుష్కలంగా తాగునీరు అం దుతుందని వివరించారు. రానున్న 30 సంవత్సరాల అవసరాలను దృష్టి లో ఉంచుకొని ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఏ ఒక్క ఇంటిని కూడా మినాహాయించకుండా మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటి కి తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు, కమిషనర్ ప్రసాద్‌రావు, మిషన్‌భగీరథ ఇంజనీర్లు డిఇ గోపా ల్, ఎఇలు యాదయ్య, సంజీవులు, చిరంజీవులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News