Saturday, April 20, 2024

జులై 3 నుంచి నాలుగో దశ వందేభారత్ మిషన్

- Advertisement -
- Advertisement -

Fourth phase of Vande Bharat mission from July 3

 

న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ నాలుగో దశలో భాగంగా జులై 3 నుంచి 15 లోగా 170 దేశాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నడపనుంది. భారత్ నుంచి కెనడా, అమెరికా, బ్రిటన్, కెన్యా, శ్రీలంక, ఫిలిప్పైన్స్,కిర్గిజ్‌స్థాన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా, మయన్మార్, జపాన్, యుక్రెయిన్, వియత్నాం దేశాలకు భారత్ నుంచి విమానాలు నడుస్తాయి. భారత్‌బ్రిటన్ మధ్య 38, భారత్ అమెరికా మధ్య 32, భారత్ సౌదీ అరేబియా మధ్య 26 విమాన సర్వీసులు నడుపుతారు. జూన్ 10 నుంచి జులై 4 వరకు మూడో దశ షెడ్యూలులో వివిధ దేశాలకు 495 విమాన సర్వీసులు నిర్వహించ వలసి ఉంది. వివిధ దేశాల్లో కరోనా కారణంగా చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం మే 6న వందేభారత్ మిషన్‌ను ప్రారంభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News