Home జాతీయ వార్తలు బెంగాల్‌లో కొనసాగుతున్న పోలింగ్

బెంగాల్‌లో కొనసాగుతున్న పోలింగ్

By-Elections-Paleruకోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సోమవారం నాల్గో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 49 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం. వీరిలో 30 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 12,481 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.