Home తాజా వార్తలు నవంబర్ మొదటి వారంలో రూ.12 వేల కోట్ల విదేశీ పెట్టుబుడులు

నవంబర్ మొదటి వారంలో రూ.12 వేల కోట్ల విదేశీ పెట్టుబుడులు

FPIs invest

 

న్యూఢిల్లీ: నవంబర్ మొదటి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల ప్రవాహాన్ని కొనసాగించారు. దేశీయ మూలధన మార్కెట్లలో దాదాపు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగైన నేపథ్యంలో ఎఫ్‌పిఐ(విదేశీ పొర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 1 నుంచి 9 మధ్య ఈక్విటీల్లో రూ.6,433 కోట్లు, డెబిట్ సెగ్మెంట్‌లో రూ.5,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తం పెట్టుబడులు రూ.12,107 కోట్లకు చేరుకున్నాయి.

రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు
దేశ విదేశీ మారక నిల్వలు వరుసగా ఆరో వారంలో 446.10 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయికి పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నవంబర్ 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 3.52 బిలియన్ డాలర్లు పెరిగి 446.10 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి కావడం విశేషం. ఇంతకుముందు అక్టోబర్ 25తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.832 బిలియన్ డాలర్లు పెరిగి 442.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆరు వారాల్లో ఇది 17.53 బిలియన్ డాలర్లు పెరిగింది. విదేశీ మారక నిల్వలలో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు నవంబర్ 1తో ముగిసిన వారంలో 3.20 బిలియన్ డాలర్లు పెరిగి 413.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో, బంగారు నిల్వలు 301 మిలియన్ డాలర్లు పెరిగి 27.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధితో నిల్వలు 10 మిలియన్ డాలర్లు పెరిగి 3.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 2 మిలియన్ డాలర్లు పెరిగి 1.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

FPIs invest over Rs 12,000 cr in first week of November